6 ఆకలేసినపుడు ప్రేగులెందుకు శబ్దం చేస్తాయి?
ఆకలిగా ఉన్నంత మాత్రాన అందరికీ ప్రేగులు శబ్దం చేయవు. అలాగే ఆకలి తీరినాక కూడా కొందరి ప్రేగులు శబ్దం చేయడం చూస్తాము. సాధారణంగా ఆకలితో ఉన్నపుడు జీర్ణకోశాల్లో ప్రేవులు మామూలు స్థితిలో కంటే ఎక్కువ ఖాళీగా ఉండడం వల్ల శబ్దాలురావడం కద్దు. శబ్దాలు రావడం అంటే గాలిలో కదలికలని మొదట అర్థం చేసుకోవాలి. మన జీర్ణవ్యవస్థ నోటితో మొదలైన మల విసర్జన రంధ్రం (గృథము)తో అంతమవుతుంది. ఈ మార్గం పొడవు మనిషి పొడవుకన్నా ఎక్కువగా ఉంటుంది. సుమారు 5 మీటర్లుండే ఈ జీర్ణవ్యవస్థలో నోరు, ఆహార వాహిక, జఠర కోశం, ఉత్తరాంత్రం, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, గృథము ఉన్నాయి. ఇందులో చిన్న ప్రేవులే సుమారు 3 మీటర్లు వరకు వ్యాపించి ఉంటాయి. చిన్నపాటి కూజా లాగా ఉండే జఠర కోశంలో ప్రోటీన్లు (లేదా మాంసకృతులు) జీర్ణమవుతాయి. ఉత్తరాంత్రంలోకి క్లోమరసం, పిత్తరసం విడుదలవుతాయి. వాటి ప్రభావంతో క్రొవ్వులు జీర్ణమవుతాయి. చిన్న ప్రేవుల్లో పిండిపదార్థాలు జీర్ణమవుతాయి. పెద్ద ప్రేవుల్లో వ్యర్థ పదార్థాల్లోని నీరు సంగ్రహించబడుంది. మధ్యఘన (semisolid) రూపంలో మిగిలిన వ్యర్థ పదార్థాలు గృథమార్గం ద్వారా కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో మలం రూపంలో విసర్జించబడ్డాయి.
చిన్న ప్రేవులగోడల్లో దట్టమైన రక్తకేశ నాళికలు ఉంటాయి. మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత మనకు పోషణనిచ్చే చక్కెరలు, అమైనో ఆమ్లాలు, లిపిడ్లతో పాటు మన శరీర ధర్మాలకు అవసరమైన ఎన్నో లవణాలు, విటమిన్లు, ఇతర పదార్థాలు ఈ రక్తనాళాల్లోకి శోషించబడతాయి. అవి రక్తప్రసరణ ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరవేయబడ్డాయి. మనం తిన్న ఆహార పదార్థాలు సరిగా జీర్ణంకానపుడు, లేదా జీర్ణవ్యవస్థలో సూక్ష్మక్రిములు చేరి నపుడు మన పొట్ట (జఠరకోశం లేదా జీర్ణాశయం) లోనూ, ప్రేవుల్లోనూ వాయువులు చేరతాయి. వాయువులు ఎపుడూ కదలికల్లో ఉంటాయి. ఎపుడూ పై భాగంలోకి చేరు కోవ డానికి ప్రయత్నిస్తాయి. జఠర కోశంలో ఏర్పడే వాయువులు నోటి ద్వారా త్రేన్పుల రూపంలో బయటికి వస్తాయి. ప్రేవుల్లో ఏర్పడ్డ వాయువులు మలవిసర్జన రంధ్రం ద్వారా అపాన వాయువుల రూపంలో బయటికి వస్తాయి ఎటూ పోవడానికి వీల్లేనపుడు ప్రేవుల్లోనే అటూఇటూ కదలడం వల్ల శబ్దాలు వస్తాయి. ఆహారం తిని చాలాసేపయ్యాక, ఆకలివేసినపుడు కూడా ప్రేవుల్లో ఖాళీ స్థలాలు ఉండడం వల్ల అందులో వాయువులు చేరితే కూడా శబ్దాలు వస్తాయి.
*****
7 నీళ్ళు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
నీటి రంగును తెలుపు అనడం సబబు కాదు. నీటికి రంగు లేదు. తెలుపు ఒక రంగు కాదు. సప్తవర్ణాల కలయికను తెలుపు అంటారు. ఆ విధంగా చూసినా నీరు తెలుపు ఛాయలో ఉండదు. నీటిని వర్ణ రహిత (Colourless) ద్రవం అంటాము. నీరు పారదర్శకంగా ఉందటాము. పాలు తెల్లగా ఉన్నాయంటాము.
నీటికి ఏ రంగూ లేకపోవడానికి కారణం తెలుసుకోవడానికి ముందు ఒక పదార్థానికి రంగు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి.
పదార్థాలు చాలా వరకు అణువులతో నిర్మితమై ఉంటాయి. ఎలాగైతే జీవకణాలతో మన శరీరం నిర్మితమైందో అలాగే అణువులతోనే చాలా సంయోగ పదార్థాలు నిర్మితమై ఉన్నాయి. అణువులలో పరమాణువులు ఉంటాయి. ఇవి పరస్పరం బంధాలతో సంధానించుకుని ఉంటాయి. పరమాణువులు అణువులుగా సమీకరించు కోవడానికి వాటి మధ్య ఏర్పచుకునే సంధానాల్ని రసాయనిక బంధాలు (Chemical bonds) అంటారు. రసాయనిక బంధాల్ని ఏర్పర్చేది కేవలం పరమాణువులలో ఉండే ఎలక్ట్రాన్లే. ఎలక్ట్రాన్లు లేకుండా పదార్థాలు ద్రవ, ఘన రూపంలోనూ, అణు రూపంలోనూ ఉండలేవు.
రసాయనిక బంధాల్ని ఏర్పర్చే ఎలక్ట్రాన్లు అణువులలోని రకరకాల శక్తి స్థావరాల్లో ఉంటాయి. ఎలాగైతే మనం నివసించే ప్రాంతాన్ని ఇంటి గది అంటామో అలాగే
అణువులలోనూ, పరమాణువులోనూ, ఎలక్ట్రాన్లు ఉండే గూళ్లను ఆర్బిటాళ్లు (Orbitals) అంటారు. పరమాణు ఆర్బిటాళ్లు పరమాణువులోనూ, అణు ఆర్బిటాళ్లు (Molecular Orbitals) అణువుల్లోనూ ఉంటాయి. మనం ఒక గది నుంచి మరో గదికి వెళ్లాలంటే నడిచి వెళ్తాము. అందుకోసం మనం ఆహారంలోని శక్తిని వాడుకుంటాము. అలాగే ఎలక్ట్రాన్లు అణువులోని ఒక ఆర్బిటాల్లో నుంచి మరో ఆర్భిటాలకు పోవాలంటే వాటికి శక్తి కావాలి. అవి కాంతి శక్తిని స్వీకరించి ఆర్బిటాళ్ల మధ్య తమ స్థావరాల్ని మార్చుకుంటాయి. అయితే శక్తి నిత్యత్వమయి (కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ) ఉంది కాబట్టి తాము ఆర్బిటాళ్ల మధ్య స్థానభ్రంశం చెందేపుడు కాంతిలోని అనేక రంగుల్లో తమకు సరిపడిన రంగుగల కాంతినే స్వీకరిస్తాయి. మనం చూసే తెలుపు కాంతి ఆ పదార్థాల మీద పడ్డప్పుడు కొన్ని రంగుల్ని ఆ పదార్థాల్లోని ఎలక్ట్రాన్లు స్వీకరిస్తే ఇక మిగిలిన రంగులే బయటకు వస్తాయి. అంటే అలా మిగిలిన కాంతినే మనం మన కళ్లతో చూస్తాము. మన కంటికి ఏ రంగు గల కాంతి చేరుతుందో ఆ రంగులోనే ఆ పదార్థం ఉంటుంది.
ఉదాహరణకు పచ్చని ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏమిటి? సప్తవర్ణాల సూర్యకాంతి ఆకులపై పడ్డప్పుడు ఆకుల్లో ఉండే పత్రహరిత రేణువుల్లోని ఎలక్ట్రాన్లు ఎరుపు, నారింజ రంగుల్ని తమ అవసరం కోసం వాడుకుంటాయి. అంటే ఆకుల్నించి బయటకి పరావర్తనం (reflection) చెందే కాంతిలో సప్తవర్ణాలుండవు. ఎరుపు, నారింజ రంగుల తీవ్రత చాలా మటుకు తగ్గిపోయి ఉంటుంది. మిగిలిన రంగులు యథాప్రకారం బయటపడతాయి. మన కంటికి చేరే కాంతిలో ఎరుపు, నారింజ రంగుల తీవ్రత తగ్గిపోయి నీలం ఆకు పచ్చ రంగుల ప్రభావం యథాప్రకారం బాగా ఉంటుంది. కాబట్టి మనం ఆకుల్ని చూస్తున్నపుడు అక్కడి నుంచి వెలుపడే కాంతి ప్రధానంగా ఆకు పచ్చరంగే కాబట్టి ఆకులు ఆకు పచ్చ రంగులో ఉంటాయి. ఎర్రమందారం ఎర్రగా కనిపిస్తుదెందుకు? కమ్యూనిస్టు పార్టీల పతాకాలు ఎర్రగా ఎందుకు ఉంటాయి? ఆయా పదార్థాల్లో ఉన్న అణువుల్లోని ఎలక్ట్రాన్లు ఎరుపు రంగును మినహాయించుకొని మిగిలిన రంగుల కాంతిని స్వాహా చేస్తాయి. అందువల్ల ఎరుపు రంగు కాంతి మాత్రమే ఎర్ర మందారాల నుంచి, ఎర్రజెండాల నుంచి, రక్తం నుంచి బయటపడ్తుంది. అందుకే ఆ వస్తువులు ఎరుపు రంగులో ఉంటాయి.
ఇక ఒక సూత్రంలాగా ఓ విషయాన్ని గుర్తుంచుకుందాం. ఒక పదార్థం 'X' అనే రంగులో కనిపిస్తుందంటే అర్ధం ఏమిటంటే ఆ వస్తువు 6 అనే రంగు గల కాంతిని వదిలేసి మిగిలిన కాంతిని హరించేస్తుందన్న మాట. 'X' మినహా మిగిలిన కాంతి భాగాన్ని 'వై' అనుకొంటే 'N' ని శోషణ కాంతి (absorbed radiation) అనీ 'X' ను పరావర్తన 508 (reflected radiation) . 'X' 2 'Y'S 5 (com-plimentary radiation) అంటారు. అలాగే' అనేది 'X' కి శేషకాంతి అవుతుంది. ఎందుకంటే 'XGY' కలిస్తే పూర్తి తెల్లని కాంతే కదా! ఒక వస్తువు తెల్లని కాంతిలోని ఏ రంగునూ గ్రహించకపోతే ఆ వస్తువు వర్ణరహితంగా (Colourless), పారదర్శకంగా (transparent) ఉంటుంది. నీటిలోని(H₂O) అణువులలోని ఎలక్ట్రాన్లు సప్తవర్ణాల్లోని ఏ వర్ణపు కాంతినీ తమ మార్పిడికి వాడుకోవు. వాటికి సరిపడిన శక్తి సప్తవర్ణాల దృశ్యకాంతిలో లేదు. కాబట్టి అవి ఏ రంగునూ గ్రహించవు. అలాంటి అణువుల పదార్థమైన నీటిమీద తెల్లని కాంతి పడితే అది నీటిగుండా సాంతం దూసుకుపోతుంది. అందుకే రంగులేదు. చక్కెర, కిరోసిన్, కర్పూరం, నాఫ్తలీన్ గోళీలు, పాలు ఇవన్నీ పారదర్శకంగా గానీ లేదా తెల్లగా గానీ కనిపించడానికి కారణం వాటి అణవులు సప్తవర్ణాల్లోని ఏ రంగునూ గ్రహించకపోవడమే!
ఇక్కడ జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలముగా మేము పాఠకమిత్రులకు ఓ విషయం వివరించాలి. మన కళ్లు ఎదురుగా ఉన్న వస్తువుల్ని చూస్తున్నాయి అంటే అర్ధం ఆయా వస్తువుల నుంచి ఆయా రంగుల కాంతులు మన కళ్లను చేరడం తప్ప మన కళ్లు ఆ వస్తువుల మీద ఏదైనా ప్రభావం కలిగించడం కాదు!
మన ఎదురుగా ఓ బొమ్మ ఉంటే ఆ బొమ్మ మీద పడ్డ కాంతిని బొమ్మలోని పదార్థాలు కొంత స్వాహా చేయగా మిగిలిన కాంతి బొమ్మలోని వివిధ భాగాల నుంచి వివిధ రంగుల్లో తెరచి ఉన్న మన కళ్ళను చేరతాయి. ఆ కాంతి కళ్లలోని కార్నియా అనే పొరద్వారా కంటిపాప అనే సందుగుండా కంటి కటకం (లెన్స్) అనే సాధనం ద్వారా కంటి వెనుక ఉన్న రెటీనా అనే తెర మీద కేంద్రీకృత మవుతుంది. అదే ఆ బొమ్మ రూపంగా మన మెదడు గ్రహిస్తుంది. అంతేగానీ ఆ బొమ్మ ఏ రంగులో ఉండాలో మన కన్ను నిర్దేశించదు. ఉదాహరణకు మనం ఓ పోస్టు కార్డు తీసుకొని దానికి మధ్యలో ఓ
సూదితో చిన్న రంధ్రం చేద్దాం. ఇపుడు ఆ పోస్టు కార్డును ఓ తెల్లనిగోడకు సమాంతరంగా ముందుకూ వెనక్కూ జరపండి. దూరంగా ఉన్న చెట్లు, భవనాల బొమ్మలు గోడమీద తలక్రిందులుగా పడడాన్ని గమనించండి. ఇపుడు పోస్టు కార్డు చేసేపనిలానే మన కన్నూ చేస్తుంది. పోస్టుకార్డు ఎలాగయితే భవనాల దృశ్యాన్ని గోడ మీద కేంద్రీకరించిందో అలాగే మన కన్నుకూడా కంటిపాప, కటకాల సహకారంతో రెటీనా అనే గోడమీద మనం చూసే దృశ్యాన్ని కేంద్రీకరిస్తుంది.
కాబట్టి దృష్టి (దిష్టి) అనేది ఉందనీ, కొందరివి చెడు చూపులు సోకి పిల్లాడికి దిష్టి తగిలిందనీ, ఇంటిమీద చూపులు పడి దిష్టి తగులుతుందనీ, ఇంటి ముందు గుమ్మడి కాయను, రాక్షసి బొమ్మను పెట్టడం వంటివి అశాస్త్రీయం. అర్థంపర్థంలేని కార్యక్రమం. ఇంత ఆధునిక సమాజంలో కూడా టివీల్లో ఒక ప్రకటనలో ఒక స్త్రీ మరో స్త్రీ చేతిలోని బిడ్డను చూస్తుండగా ఆమె కంటిలోంచి ఏదో హానికరమైన చూపులు బిడ్డ మీద సోకుతున్నట్లు చూపుతారు. ఇది పూర్తిగా అర్థంలేని అశాస్త్రీయ అంశం. శాస్త్రీయ దృక్పథాన్ని పౌరులకు అలవర్చడం అనే రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వర్తించాల్సిన ప్రభుత్వం ఇటువంటి ప్రకటనలను నిషేధించాలి. కంటి చూపుతో కాల్చేస్తానని మరో హీరో అంటాడు. ఇది కూడా పూర్తి అబద్ధం. వేరొకరు కంటి చూపుల్తో వస్తువుల్ని కదిలిస్తాం అంటారు. ఇది అసంభవం. కంటి మీదే ఎదుటి వస్తువు నుంచి కాంతి పడ్తుంది గానీ ఎదుటి వస్తువు మీద కాంతిని పడేయడానికి కళ్లు టార్చి లైట్లు కాదు. ఎదుటి వ్యక్తి మీద, భవనంమీద దుష్ప్రభావం కలిగించేందుకు కళ్లు తుపాకులు కాదు. కడ్డీలను వంచడానికి కంటి నుంచి ఏ రకమైన తీగలు, కత్తెరలు బయటికిరావు. కంటి నుంచి ఏ రకమైన శక్తి వస్తువు మీద పడదు.
*****
8 వెంట్రుకలు, గోళ్లు కత్తిరిస్తే
నొప్పి ఉండదెందుకు?